రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన నందమూరి హరికృష్ణ

  • బుధవారం నాడు కన్నుమూసిన రాజశేఖర్ తల్లి
  • ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన హరికృష్ణ
  • చెన్నైలో అంత్యక్రియలు జరుపుతామన్న రాజశేఖర్
ఈ ఉదయం నందమూరి హరికృష్ణ నటుడు రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. రాజశేఖర్ తల్లి ఆండాళ్ వరదరాజ్ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. ఆ వార్తను తెలుసుకున్న హరికృష్ణ, రాజశేఖర్ ను కలిసి, ఆయన తల్లి మృతికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసి కొంతసేపు ఓదార్చారు.

కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైన ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని చెన్నైలోని స్వగృహానికి తీసుకెళ్లి, అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు రాజశేఖర్ వెల్లడించారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
Go Back to Shorts
rajashekar
namdamuri harikrishna

More Telugu News